TTD: తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం

ABN, First Publish Date - 2023-04-06T19:56:00+05:30

తిరుమల (Tirumala)లో గురువారం మతిస్థిమితం లేని ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తనకు మద్యం కావాలని, ఇవ్వకుంటే పైనుంచి కిందకు దూకేస్తానంటూ

TTD: తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమల (Tirumala)లో గురువారం మతిస్థిమితం లేని ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తనకు మద్యం కావాలని, ఇవ్వకుంటే పైనుంచి కిందకు దూకేస్తానంటూ గాజుబాటిల్‌తో హడావుడి సృష్టించాడు. తెలంగాణ (Telangana)లోని జహీరాబాద్‌ (Zahirabad)కు చెందిన మహేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి రెండురోజుల క్రితం తిరుమలకు వచ్చాడు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి దర్శనం పూర్తిచేసుకునేంతవరకు బాగానే ఉన్న మహేష్‌ గురువారం ఉదయం నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకు మద్యం కావాలంటూ పెద్దగా అరుస్తూ లేపాక్షి సర్కిల్‌ (Lepakshi Circle) వద్ద వున్న బ్రిడ్జిపైకి ఎక్కాడు. దగ్గరకు వస్తే పొడిచేస్తానంటూ గాజు బాటిల్‌తో హడావుడి సృష్టించాడు. ఈ క్రమంలో మహేష్‌ను పట్టుకోవడానికి నరేష్‌ అనే సెక్యూరిటీ గార్డు బ్రిడ్డిపైకి ఎక్కాడు. వెనుకనుంచి పట్టుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో ఇద్దరూ ఒక్కసారిగా కిందపడిపోయారు. మహేష్‌కు చిన్నపాటి గాయాలు కాగా, సెక్యూరిటీగార్డు నరేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరిని అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. నరేష్‌కు కాలు విరగడంతో తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో లేపాక్షి ప్రాంతమంతా గందరగోళంగా మారి భక్తులు ఆందోళనకు గురయ్యారు.

Updated Date - 2023-04-06T19:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising