Supreme Court: జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ABN, First Publish Date - 2023-09-15T18:27:58+05:30
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు (Jagan Govt) సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. సూర్యనారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఢిల్లీ: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు (Jagan Govt) సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. సూర్యనారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విచారణ పూర్తయ్యేంతవరకూ సూర్యనారాయణను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటో తమకు తెలుసని న్యాయమూర్తి అభయ్ ఓకా వ్యాఖ్యానించారు. సూర్యనారాయణ తరపున సుప్రీం కోర్టులో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదించారు. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సూర్యనారాయణ సుప్రీంలో సవాలు చేశారు. తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.
Updated Date - 2023-09-15T18:29:28+05:30 IST