AP Govt: రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కార్
ABN, First Publish Date - 2023-05-30T15:55:28+05:30
ఏపీ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన సర్కార్ తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది.
అమరావతి: ఏపీ సర్కార్ (AP Govt) అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన సర్కార్ తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank)లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఆర్‌బీఐ (RBI) దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణం పొందింది. 10 ఏళ్లకుగానూ 7.37 % వడ్డీతో వెయ్యి కోట్ల అప్పు పొందింది. 12 ఏళ్లకుగానూ 7.38% వడ్డీతో మరో వెయ్యి కోట్ల రుణం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM)లో రూ.15,500 కోట్ల అప్పు ఏపీ తెచ్చింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మిగులు ఉంది.
రాష్ట్రం అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు. అది కూడా... రాష్ట్రాల ఆర్థిక వనరులు, తిరిగి చెల్లించగల స్తోమత ఆధారంగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ... జగన్ (Jagan) ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం సరిపోవడంలేదు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి కూడా సరిపోవడం లేదు. అందుకే అప్పులు తేవడంపై రాష్ట్రం దృష్టి సారించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో గానీ, సేవా రంగంలో గానీ, పారిశ్రామిక రంగంలో గానీ అసలు వృద్ధి జాడలే లేవు. ఖజానాకు ఆదాయం లేదు. కొత్త ఉద్యోగాల ఊసూ లేదు.
Updated Date - 2023-05-30T15:55:28+05:30 IST