Chandrababu: కరుడుగట్టిన ఉగ్రవాదిలా జగన్ ప్రవర్తిస్తుంటే..: చంద్రబాబు
ABN, First Publish Date - 2023-02-21T18:03:52+05:30
కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తుంటే.. పోలీసులు బాధ్యత మరిచి జగన్ (Jagan)కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు.
అమరావతి: కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తుంటే.. పోలీసులు బాధ్యత మరిచి జగన్ (Jagan)కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. గన్నవరం దాడులు జగన్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతోనే ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులతో భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ (TDP) నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections).. పార్టీ ఇన్‌చార్జ్లు, నేతల పనితీరుకు పరీక్ష అని పేర్కొన్నారు. శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్కు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదు లేదన్నారు. మండలి దండగ.. ప్రజా ప్రయోజనం లేదన్న జగన్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? అని ప్రశ్నించారు. తీవ్ర అసహనంలో ఉన్న జగన్ హింసకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా పోటీచేసే 18 మంది అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఖరారుచేశారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మెల్యేల కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. వారి జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. మొత్తంగా బీసీలకు 11, అగ్ర వర్ణాలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 చొప్పున కేటాయించారు.
Updated Date - 2023-02-21T18:03:53+05:30 IST