ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: జగన్‌ ఏపీని రైతులు లేని రాజ్యంగా మార్చేస్తున్నారు: లోకేశ్‌

ABN, First Publish Date - 2023-04-08T18:51:46+05:30

టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపడుతున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కు విశేష స్పందన వస్తోంది. పాదయాత్రంలో భాగంగా రైతులతో నారా లోకేశ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపడుతున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కు విశేష స్పందన వస్తోంది. పాదయాత్రంలో భాగంగా రైతులతో నారా లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని జగన్‌ సర్కార్‌ పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ (CM Jagan) ఏపీని రైతులు లేని రాజ్యంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం ఉందని తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల అప్పుల భారం మోపారని గుర్తుచేశారు. ఇప్పటికీ 60% మంది రైతులు సాగుపైనే ఆధారపడ్డారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల మనసు గెలిచాకే తలపాగా కడతామని నారా లోకేశ్‌ ప్రకటించారు.

మరోవైపు దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి భగవత్ (Union Minister Bhagwat) రాజ్యసభలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యధిక మంది ఆధారపడేది వ్యవసాయంపైనే. సాగు చేయాలంటే పెట్టుబడి కావాలి. గతంలో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలు అందించేవారు. దీనివల్ల రైతన్నలకు వడ్డీల భారం తగ్గేది. జగన్‌ (Jagan) సర్కారు పావలా వడ్డీ రుణాలకు మంగళం పాడేసింది. వడ్డీతో సహా రుణం చెల్లిస్తేనే సున్నా వడ్డీ రాయితీ అని మెలిక పెట్టింది. దీంతో రైతుల (Farmers)పై వడ్డీల భారం పడుతోంది. ఇక 90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం లేదు.

ఈ లెక్కన వైసీపీ (YCP) ప్రభుత్వం వల్ల అన్నదాతలకు కొత్తగా ఒనగూరుతున్నదేమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి అందుతోంది. గత ప్రభుత్వంలో రాయితీపై సూక్ష్మపోషకాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, ఇలా అనేక రకాలుగా రైతాంగానికి లబ్ధి ఉండేది. ఇప్పుడు రాయితీ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు. కొన్ని పథకాలు ఉన్నాయో లేవో రైతులకే తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల రైతులకు మేలు జరగడం లేదు. వ్యవసాయానికి తగినంత ఊతం అందడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం, పరిహారం అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకొంటోంది.

Updated Date - 2023-04-08T18:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising