ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan: సదస్సు పేరుతో ఢిల్లీకి జగన్..? అసలు కారణం ఇదేనా..!

ABN, First Publish Date - 2023-01-29T17:14:02+05:30

అందరూ ఊహించిందే జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అందరూ ఊహించిందే జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. మంగళవారం అక్కడ జరగనున్న జీ-20 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో సీఎం పాల్గొనడంపై ముందస్తు సమాచారమేదీ లేదు. శనివారం అకస్మాత్తుగా ఇది తెరపైకి వచ్చింది. అనూహ్యంగా జగన్ ఢిల్లీ వెళ్లడంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో మరో అధ్యాయం మొదలైంది. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌‌రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. శనివారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌‌రెడ్డిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఖాయమని, వివేకా కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయల్సిందిగా కేంద్ర పెద్దలను కలవడం ఖాయమని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి అనుగుణంగానే సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తును సీబీఐ మళ్లీ వేగవంతం చేయడం... మరీ ముఖ్యంగా ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy)కి నోటీసులు ఇవ్వడంతో ‘తాడేపల్లి’ శిబిరంలో ఉలికిపాటు మొదలైందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ అడుగులను గురువారం నుంచే తాడేపల్లి వ్యూహకర్తలు గమనిస్తూ వస్తున్నారు. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచిన ప్రతిసారీ... ‘ఏదో ఒక పని మీద’ జగన్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. ఈసారి కూడా ఆయన ఢిల్లీకి వెళ్లడం ఖాయమని మూడు రోజులుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) అపాయింట్‌మెంట్‌ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ... వారు సమయం ఇవ్వకపోవడంతో, ఒక్కసారిగా ‘గ్లోబల్‌ సమ్మిట్‌’ (Global Summit) గుర్తుకువచ్చింది. ఆ సదస్సు పేరుతో ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర పెద్దలను కలిసే అవకాశముంది.

నాడు రాంసింగ్‌పై కేసు... ఆయన ముందే హాజరు

వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ (SP Ramsingh) తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని... కొంతమందికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీపై కడప పోలీసులు కేసు కూడా పెట్టారు. ఉదయ్‌కుమార్‌ ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సన్నిహితుడని పేరుంది. ఇప్పుడు అదే అధికారి ముందు ఆయన విచారణకు రావాల్సి వచ్చింది. రాంసింగ్‌పై అనంతపురం, కడప ఎస్పీలకు కూడా ఫిర్యాదులు చేశారు.

Updated Date - 2023-01-29T17:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising