ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kadapa SP: బీటెక్ రవి అరెస్టులో పోలీసులపై ప్రముఖ రాజకీయ నేత ఆరోపణలు అవాస్తవం

ABN, First Publish Date - 2023-11-23T21:14:21+05:30

పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్టులో పోలీసులపై ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని కడప ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తెలిపారు. లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం బీటెక్ రవిని అరెస్టు చేశామని, ఒక క్రిమినల్ కేసులో బీటెక్ రవిని అరెస్టు చేశామన్నారు. విచారణ అధికారి సమక్షంలో రెండు మూడు గంటల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.

కడప: పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్టులో పోలీసులపై ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని కడప ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తెలిపారు. లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం బీటెక్ రవిని అరెస్టు చేశామని, ఒక క్రిమినల్ కేసులో బీటెక్ రవిని అరెస్టు చేశామన్నారు. విచారణ అధికారి సమక్షంలో రెండు మూడు గంటల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. కోర్టుముందు కూడా బీటెక్ రవి ఎటువంటి ఆరోపణలు చేయలేదని, చట్ట ప్రకారమే పోలీసులు పని చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.

"లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం బీటెక్ రవిని అరెస్టు చేశాం. ఒక క్రిమినల్ కేసులో బీటెక్ రవిని అరెస్టు చేశాం. విచారణ అధికారి సమక్షంలో రెండు మూడు గంటల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అరెస్టు చేసి చూపించాం. కోర్టుముందు కూడా బీటెక్ రవి ఎటువంటి ఆరోపణలు చేయలేదు. చట్ట ప్రకారమే పోలీసులు పని చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉంటుంది. పోలీస్ మాన్యువల్‌పై అలిగేషన్లు పెట్టడం సమంజసం కాదు. ప్రత్యేకంగా ఒక్క అధికారిని టార్గెట్ చేసి మాట్లాడడం కూడా సరైంది కాదు. ఆరోపణలు చేసిన సీనియర్ రాజకీయ నేతకు లీగల్ నోటీసులు పంపిస్తాం. అరెస్టు చేసిన వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించాం. మరెక్కడ విచారించలేదు. ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు." అని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-11-23T21:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising