YCP: హద్దు దాటిన వైసీపీ నేతల ధౌర్జన్య కాండ
ABN, First Publish Date - 2023-04-05T16:57:19+05:30
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) సొంత ఇలాకా కడప (Kadapa) జిల్లాలో మితి మీరిపోతున్నకొందరు వైసీపీ (YCP) నేతల ధౌర్జన్య కాండకు పాల్పడుతున్నారు.
కడప: సీఎం జగన్ రెడ్డి (CM Jagan) సొంత ఇలాకా కడప (Kadapa) జిల్లాలో మితి మీరిపోతున్నకొందరు వైసీపీ (YCP) నేతల ధౌర్జన్య కాండకు పాల్పడుతున్నారు. బి మఠం తహసీల్దార్ కిషోర్‌రెడ్డిని జడ్పీటీసీ (ZPTC) రామగోవిందరెడ్డి బెదిరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన అనుచరులతో తహసిల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన జడ్పీటీసీ రామగోవిందరెడ్డి తహసిల్దార్‌ను బెదిరించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నది.. వైసీపీ అని గుర్తుంచుకొని తాము ఏది చెబితే అది చెయ్యాలని జడ్పీటీసీ హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే వెళ్లిపోవాలని... పురుష పదజాలంతో జడ్పీటీసీ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడ్డ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తహసిల్దార్ కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Updated Date - 2023-04-05T16:57:22+05:30 IST