ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Murder Case.. వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

ABN, First Publish Date - 2023-04-16T07:58:13+05:30

వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా రెండో రోజు ఆదివారం తెల్లవారుజామున పులివెందులకు అధికారులు రెండు వాహనాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా రెండో రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి.. నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది.

కాగా వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను అధికారులు ప్రస్తావించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ పేర్కొంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన విషయాలు.. ‘‘హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్‌లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలింది. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారు. అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటాడు.

వివేకా చనిపోయాడు అని తెలిసే వరకూ ఇంట్లోనే ఉన్నారు. వివేకా మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారు. బాత్రూం నుంచి డెడ్ బాడీని బెడ్ రూమ్‌కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడు. వివేకా తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి గుండెపోటు అని చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉంది. గాయాలు కనపడకుండా ఉండేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని సంప్రదించి కుట్లు వేయించారు. చనిపోయిన వివేకా తలకు ప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ వేశాడు. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన తమ విచారణకు సహకరించడం లేదు. పారిపోతాడనేటువంటి అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశాం’’ . కాగా.. ఈ కేసులో ఇంకా విచారణ చేస్తున్నామని.. మరికొంత మందిని కూడా అరెస్టు చేస్తామని సీబీఐ తెలిపింద

Updated Date - 2023-04-16T08:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising