ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulasi Reddy: ‘బీసీల నిజ నేస్తం కాంగ్రెస్ ఒక్కటే’

ABN, First Publish Date - 2023-04-28T12:46:22+05:30

బీసీల పట్ల వైసీపీ, టీడీపీలది కపట ప్రేమ మాత్రమే అని.. బీసీల నిజ నేస్తం కాంగ్రెస్ ఒక్కటే అని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బీసీల పట్ల వైసీపీ, టీడీపీలది కపట ప్రేమ మాత్రమే అని.. బీసీల నిజ నేస్తం కాంగ్రెస్ ఒక్కటే అని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి (Congress Leader N Tulasireddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 1970 లోనే విద్యా, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 25 శాతం రిజర్వషన్లు కల్పించిందని తెలిపారు. 1993లోనే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. అలాగే 2008లో కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రారంభించిందన్నారు. 1994లోనే కాంగ్రెస్ పార్టీ సచివాలయంలో బీసీ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 4 బీసీ కమిషన్లు, బీసీ హాస్టళ్లు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించిందని తెలిపారు. ఇప్పటికైనా వైపీనీ, టీడీపీలు బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని తులసిరెడ్డి హితవుపలికారు.

Updated Date - 2023-04-28T12:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising