scorecardresearch

నందలూరులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలి

ABN , First Publish Date - 2023-01-31T23:14:41+05:30 IST

బ్రిటీష్‌ కాలం నుంచీ ఎంతో ప్రాముఖ్యత ను కలిగిన నందలూరు రైల్వేస్టే షన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపా లని ఐక్య ప్రగతి సంఘం డి మాండ్‌ చేస్తూ సంతకాల సేకర ణ చేపట్టింది.

నందలూరులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలి
రైళ్ల నిలుపుదల కోసం సంతకాలు చేస్తున్న దృశ్యం

సంతకాల సేకరణలో ఐకేపీఎస్‌

నందలూరు, జనవరి31: బ్రిటీష్‌ కాలం నుంచీ ఎంతో ప్రాముఖ్యత ను కలిగిన నందలూరు రైల్వేస్టే షన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపా లని ఐక్య ప్రగతి సంఘం డి మాండ్‌ చేస్తూ సంతకాల సేకర ణ చేపట్టింది. మంగళవారం మండల ప్రజల నుంచి బస్టాం డు కూడలిలో సంతకాల సేకరణ చేపట్టిన ఐకేపీఎస్‌ నేతలు పోతురాజు మస్తానయ్య, ఆర్ముగం విశ్వనాధ్‌ మాట్లాడుతూ కరోనా సంక్షోభంతో నందలూరులో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టాపింగ్‌ను రద్దు చేసిందన్నారు. నూతన రైల్వే పరిశ్రమ ఏర్పాటు కోసం సుమారు 77 రోజులు ఉధ్యమా లు చేపట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

అప్పట్లో నేతలు ఇచ్చిన హామీ పట్ల అధికారులు సీత కన్ను వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నందలూరు రైల్వే కేంద్రం పూర్వవైభవం సంతరించుకునే వరకూ పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు. సంతకాల సేకరణకు రాజంపేట నియోజకవర్గ యువజన నేత మేడా విజయశేఖర్‌రెడ్డి మద్దతును తెలియజేశారు సంతకాల సేకరణలో టీడీపీ నేతలు మోడపోతుల రాము, ముస్లిం మైనార్టీ నేతలు జుల్ఫీకర్‌, నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, సీపీఐ జిల్లా నేత మహేష్‌, అన్ని పార్టీల నేతలు, ఐక్య ప్రగతి సంఘం నేతలు, అఖిలపక్షం, మేధావి వర్గం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T23:14:42+05:30 IST