ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సీజేఐ ఆశ్చర్యం, ఆగ్రహం !

ABN, First Publish Date - 2023-05-24T13:01:06+05:30

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసుపై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసు (Erra Gangireddy Bail Case)పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ... తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court)లో బుధవారం విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారించాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరారు. జులై 1వ తేదీ తరువాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింత లా ఉందని సీబీఐ (CBI) తరపున హాజరైన న్యాయవాది ఏఎస్‌జీ సంజయ్ జైన్ పేర్కొంటూ.. గంగిరెడ్డి పిటీషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో సుప్రీం కోర్టు ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.

గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేసిన వ్యవహారంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 30వ తేదీ లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తూ... బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. జులై 1న బెయిల్ ఇవ్వాలని షరతు విధిస్తూ... హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... సునీత (Sunitha) సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని గత వారం సీజేఐ ముందు సునీత తరపు న్యాయవాది మెన్షన్ చేశారు.

కాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సీజేఐ ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud) తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు. ఈ క్రమంలో విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసిన సీజేఐ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Updated Date - 2023-05-24T13:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising