కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kala Venkat Rao: స్కిల్ కేసులో ఒక్క ఆధారం చూపించగలరా..?

ABN, First Publish Date - 2023-09-30T12:44:52+05:30

వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబుని అరెస్ట్ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శించారు. 20 రోజుల్లో జగన్ బృందం ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయిందన్నారు.

Kala Venkat Rao:  స్కిల్ కేసులో ఒక్క ఆధారం చూపించగలరా..?

శ్రీకాకుళం : వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబుని అరెస్ట్ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శించారు. 20 రోజుల్లో జగన్ బృందం ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయిందన్నారు. అధికారం అండతో రాజ్యాంగాన్ని బ్రష్టుపట్టించి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అవినీతి బురద రాసేస్తున్నారన్నారు. బొత్స వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని కళా వెంకట్రావు అన్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం చూపించగలరా..? అని నిలదీశారు. వైఎస్ హయాంలో అనేక కేసులు చంద్రబాబుపై మోపారని.. ఒక్కటైన రుజువు చేయగలిగారా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

‘‘మీ చొక్కా మీద ఎన్ని మరకలు ఉన్నాయో వెనుదిరిగి చూసుకో. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో మద్యానికి ఎంతమంది ఓనర్ లు ఉన్నారు? నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు సాగటం లేదు. రాష్ట్రంలో అమ్మకాలు సాగిస్తున్న మద్యానికి పేటీఎం ఎందుకు లేదు? పానీపూరి షాపులో ఆన్‌లైన్ పేమెంట్ ఉంది మద్యం షాపులో ఎందుకు లేదు..? బురద చెల్లెస్తాం కడుక్కోండి అంటే కుదరదు. ప్రపంచం మొత్తం చంద్రబాబు వెనుక నిలబడింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారు. జగన్ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి అరిష్టం. దుష్ట శక్తులపై ప్రజలు పోరాడాలి. రాష్ట్రంలో చట్టం పనిచేస్తోందా? ఓ దళితుణ్ణి చంపి కారులో ఇంటికి శవం పంపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తూటాతో కాల్చి చంపి బంగాళాఖాతంలో పడేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం ఆపాలి’’ అని కళా వెంకట్రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-30T12:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising