Kanna Lakshminarayana : మన నీరో తాడేపల్లి పాలస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నాడు
ABN, First Publish Date - 2023-05-09T13:25:41+05:30
అకాల వర్షం వలన రైతులు రోడ్డున పడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మన నీరో తాడేపల్లి పాలస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నాడని టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.
అమరావతి : అకాల వర్షం వలన రైతులు రోడ్డున పడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మన నీరో తాడేపల్లి పాలస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నాడని టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పాల్సిన్న ప్రభుత్వం ప్రతిపక్షంపై విమర్శలు చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. రైతును భక్షించే కేంద్రాలుగా ఆర్‌బీకేలు ఉన్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్తే లారికి 10 వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నాలుగేళ్లలో పంట కాపాడుకునేందుకు ఒక పరదా పట్టా అయినా ఇప్పించారా? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
‘‘సీఎం చేతకానితనం వలన రైతులకు నష్టం వాటిల్లింది. గిట్టుబాటు ధరలు, స్థిరీకరణ అని చెప్పిన గొప్ప మాటలు ఏమయ్యాయి? ఎన్నికల మేనిఫెస్టోను చూసుకోండి. రైతు బంధు పథకం ఉండేది. అది కూడా తీసేశారు. నూటికి నూరు శాతం రైతు నష్టపోవడానికి కారణం సీఎం జగనే. 9 వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతాం. రంగుమారిన, తేమ వంటి సాకులు చెప్ప కుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి. పంటలను బట్టి ఎకరాకు 25 వేలు ఇవ్వాలి. పసుపు, మిర్చి, మామిడి రైతులకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలి. రైతుకు సీఎం క్షమాపణ చెప్పాలి. జవాబుదారీ తనం ఉండాల్సిన చోట జేబు దొంగలు ఉన్నారు. చేత కాక పోతే తప్పుకో.. మేము రైతును అదుకుంటాం’’ అని కన్నా తెలిపారు.
Updated Date - 2023-05-09T13:25:41+05:30 IST