ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana : చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన కన్నా.. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని వెల్లడి..

ABN, First Publish Date - 2023-06-01T12:37:56+05:30

తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.

కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సత్తెనపల్లికి ఇంతకు ముందు డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం తర్వాత అక్కడ ఎవరినీ ఇన్‌ఛార్జిగా నియమించలేదు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కోడెల శివ ప్రసాదరావు తనయుడు శివరాం బుధవారం సత్తెనపల్లిలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కన్నా నియామకాన్ని నిరసించారు. కోడెల పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకొని కుటుంబ వారసుడిగా సత్తెనపల్లిలో తనకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

టీడీపీలో కన్నా చేరాక ఆయన పెదకూరపాడు లేదంటే గుంటూరు పశ్చిమ నుంచి‌ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. అనుహ్యంగా చంద్రబాబు కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్‌చార్జ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు అంబటి రాంబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అవసరమున్నా లేకున్నా.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటికి చెక్ పెట్టేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాను అధిష్టానం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ పదవిని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు తదితరులు ఆశిస్తున్నారు. మరి వీరికి చంద్రబాబు ఎలా సర్ది చెబుతారో చూడాలి.

Updated Date - 2023-06-01T12:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising