ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanna Lakshminarayana : జగన్ రెడ్డి సైకో అని తొలి నుంచి చెబుతున్నా

ABN, First Publish Date - 2023-07-20T11:23:34+05:30

రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు.

గుంటూరు : రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు. గోదావరి వరదలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులు వదిలేస్తున్నారన్నారు. కానీ పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వటం లేదన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్ చేయటం లేదని కన్నా అన్నారు. జగన్ రెడ్డి సైకో అని నేను తొలి నుంచి చెబుతాన్నానన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ రైతులకు ఇబ్బంది ఉండరాదని చంద్రబాబు పట్టిసీమ కట్టించారని కన్నా తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసే పరిస్థితి లేదన్నారు. పట్టిసీమ నుంచి వెంటనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలన్నారు. కాలువలు మరమ్మతులు ఇప్పటి వరకూ చేయకపోవడం గతంలో ఎప్పుడూ లేదని కన్నా అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే లేదన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా దిగజారిన పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. పోలీసులు ప్రజాస్వామిక విలువలు కాపాడే ప్రయత్నం చేయాలని కన్నా పేర్కొన్నారు.

Updated Date - 2023-07-20T11:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising