ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalava Srinivas: కాపు సవాల్‌.. కాలవ స్పందన

ABN, First Publish Date - 2023-04-20T21:22:19+05:30

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) సవాలును స్వీకరించి.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) చర్చకు వెళ్లడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) సవాలును స్వీకరించి.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) చర్చకు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే హనుమాపురంలో శుక్రవారం చర్చకు రావాలని కాలవ శ్రీనివాసులుకు స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. కణేకల్లు మండలం హనుమాపురంలో గురువారం గడప గడప, సచివాలయాల ప్రారంభోత్సవానికి కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులుకు సవాలు విసిరారు. దీంతో స్పందించిన కాలవ, గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమాపురం చేరుకున్నారు. కాలవకు మద్దతుగా టీడీపీ (TDP) శ్రేణులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హనుమాపురం చేరుకున్నారు. బహిరంగ చర్చపేరిట ఇద్దరు నాయకులు ఎదురుపడితే గ్రామంలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని, వెంటనే వెళ్లిపోవాలని కాలవ శ్రీనివాసులుకు పోలీసు అధికారులు సూచించారు. ఆయన ససేమిరా అనడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు కాలవ శ్రీనివాసులును బలవంతంగా అరెస్టు చేసి తరలించబోయారు. పోలీసు వాహనాలకు టీడీపీ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదాలు జరిగాయి. చివరకు కాలవ శ్రీనివాసులును అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలిపెట్టారు.

Updated Date - 2023-04-20T21:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising