Amaravati: రాజధాని తరలింపుపై రఘురామ కీలక వ్యాఖ్యలు: రఘురామ
ABN, First Publish Date - 2023-02-27T15:38:05+05:30
రాజధాని అమరావతి (Amaravati) తరలింపుపై ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: రాజధాని అమరావతి (Amaravati) తరలింపుపై ఎంపీ రఘురామరాజు (Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు కంగారు పడొద్దని, రాజధాని తరలింపు కలలో కూడా నెరవేరదని జోస్యం చెప్పారు. జగన్ (Jagan) తన నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, రాజధాని మార్పు మాత్రం కుదరదని తెలిపారు. అమరావతి రాజధాని కేసును త్వరగా విచారించాలని, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరిందని, కేసు విచారణ మార్చి 28వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఇలాంటి వారిని ఎన్నుకున్నమా? అని ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ పరిస్థితి ఉత్తరాంధ్రలో ఘోరంగా ఉందని తెలిపారు. విశాఖపట్నంలో సీఎం జగన్ ఆస్తుల కొనుగోలు చేశారని ఆరోపించారు.
జగన్కు పట్టభద్రుల ఓటు హక్కు తీసుకోలేదు
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారని, మాజీమంత్రి వివేకా మరణం వైఎస్సార్ కుటుంబానికి బాధాకరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల క్లియర్గా చెప్పిందని గుర్తుచేశారు. త్వరలో గంగిరెడ్డి పిటిషన్ రాబోతుందని, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక స్పష్టత రాబోతోందని వివరించారు. ఏపీలో రూ.వేల కోట్ల లిక్కర్ బిజినెస్ (Liquor Business) జరుగుతోందని ఆరోపించారు. 3 వేల వైన్ షాప్స్ ఉంటే 11 షాపులకు డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెట్టారని పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. జగన్కు పట్టభద్రుల ఓటు హక్కు తీసుకోలేదని, పులివెందుల వెళ్లి ఓటు తీసుకోవాల్సి ఉంటుందని, అంత ఖర్చు ఎందుకు అని అనుకొని ఉంటాడని రఘురామకృష్ణరాజు వివరించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్కుమార్పై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ డీజీపికి లేఖ రాశారని తెలిపారు. సునీల్పై చర్యలు తీసుకోవాలని తానూ కేంద్రానికి లేఖ రాశానని గుర్తుచేశారు. సునీల్కుమార్పై చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-02-27T15:38:07+05:30 IST