Kodikatti case: కోడికత్తి కేసులో వాడివేడి వాదనలు..
ABN, First Publish Date - 2023-07-12T21:21:42+05:30
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) కోడికత్తితో (Kodikatti case) జరిగిన హత్యాయత్నం కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం కూడా విచారణ జరిగింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) కోడికత్తితో (Kodikatti case) జరిగిన హత్యాయత్నం కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం కూడా విచారణ జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుడు తరపున అయన న్యాయవాది అబ్దుల్ సలీం వాదించారు. ఈ రోజు కూడా నిందితుడు కోడికత్తి శ్రీనివాస్ విచారణకు హాజరయ్యాడు. కుట్రకోణంపై మరల విచారణ చేయాలని మరోసారి జగన్ తరపు న్యాయవాది వెంకటేశ్వర్లు కోరారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసినట్లు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఈ కేసులో మంగళవారం ఇన్ కెమెరా విచారణ జరిగింది. వాదనలు ప్రారంభించడానికి ముందు జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు ఇన్ కెమెరా విచారణకు అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి ఎ.సత్యానంద్ అంగీకరించారు. కేసుతో సంబంధం లేని న్యాయవాదులను కోర్టు హాలు నుంచి బయటకు పంపేశారు. తలుపులు, కిటికీలు మూసివేయించిన తర్వాత వెంకటేశ్వర్లు సుమారు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. ఇంతకుముందే ఈ కేసులో తదుపరి విచారణ చేయాలని, జగన్‌కు కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇనకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండింటిపైనా ఆయన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్‌ఐఏకు 17న నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.
Updated Date - 2023-07-12T21:56:16+05:30 IST