Rakshana Nidhi: పంతం నెగ్గించుకున్న తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2023-09-03T16:32:59+05:30
తిరువూరు వైసీపీ (YCP) ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి (Kokkiligadda Rakshana Nidhi) పంతం నెగ్గించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసీపీ (YCP) ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి (Kokkiligadda Rakshana Nidhi) పంతం నెగ్గించుకున్నారు. తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ మార్పుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలికకు చెందిన 16 మంది కౌన్సిలర్లతో నియోజకవర్గం పరిశీలకులు అయోధ్య రామిరెడ్డి, గౌతంరెడ్డి సమావేశమయ్యారు. రెండేళ్ల పదవి మార్పు ఒప్పందం అమలు చేయాలని 16 మంది కౌన్సిలర్లు ఏకాభిప్రాయం కోరారు. ఛైర్మన్ పదవి కోసం మోదుగు ప్రసాద్ పేరును 16 మంది వైసీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించారు. దీనిపై అధిష్టానం పెద్దలు సానుకూలంగా స్పందించారు. 5 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని పెద్దలు స్పష్టం చేశారు. మోదుగు ప్రసాద్‌ను ఛైర్మన్ పదవి వరించనుంది. ప్రస్తుత ఛైర్ పర్సన్ గత్తం కస్తూరి భాయి భర్త నాగేశ్వరరావుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-09-03T16:33:07+05:30 IST