ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: బీసీ భరోసా లోగోను ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-06-14T13:10:08+05:30

అమరావతి: బీసీ భరోసా లోగోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీసీ (BC) భరోసా లోగోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కార్యక్రమం చేపడతామన్నారు. బీసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి రక్షణ కోసం ఒక చట్టం తేవాలని అనుకున్నామని, దీనిపై పూర్తి స్థాయిలో న్యాయవాదులతో మాట్లాడి చట్టం తీసుకొస్తామన్నారు. నాలుగున్నరేళ్లల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి (AP Economic Situation) ఛిన్నాభిన్నం అయిందన్నారు. ధరలు పెంచి.. పన్నులేశారని, రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.

సంక్షేమం పేరుతో ప్రభుత్వం మాయ మాటలు..

సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) మాయ మాటలు చెప్పిందని, నాలుగున్నరేళ్లల్లో ప్రతి ఒక్కరి మీద రూ. 2.50 లక్షల అప్పు పెరిగిందని అచ్చెన్నాయుడు అన్నారు. నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని.. పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెచ్చిన అప్పుల్లో 90 శాతం దొపిడీ జరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు చూశాక భవిష్యత్ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. మహాశక్తి పేరుతో మహిళలకు లబ్ది చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెల రూ. 1500 ఇస్తామని, తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలున్నా రూ. 15 వేలు ఇస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకూ రూ. 20 వేలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ. 2,500 భృతి అందజేస్తామన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకున్నామని, ఐదు జోన్లల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుల్లో ప్రచారం చేపడతామన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు పల్లె నిద్ర చేపడతారన్నారు. సోమవారం భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సులను చంద్రబాబు ప్రారంభిస్తారని, 30 రోజుల్లో 125 నియోజకవర్గాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుల్లో ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T13:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising