Cpi ramakrishna: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ రామకృష్ణ
ABN, First Publish Date - 2023-10-07T15:19:56+05:30
వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) సీపీఐ రామకృష్ణ (Cpi ramakrishna) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో (Cm jagan) ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) సీపీఐ రామకృష్ణ (Cpi ramakrishna) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో (Cm jagan) ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా.. అప్పర్ భద్రకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికే. సీఎం ఉత్తరం రాసి వదిలేశారు తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారు. చేతకాని దద్దమ్మ సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలి. పవన్ కళ్యాణ్‌ని అభినందిస్తున్నా. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన తన వైఖరి చెప్పారు.’’ అని తెలిపారు.
Updated Date - 2023-10-07T15:19:56+05:30 IST