ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీ టెన్త్ ఫలితాల విడుదలలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-06T12:04:50+05:30

ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. కాగా.. ఫలితాల విడుదల సమయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జయాపజయాలు విద్యార్థులు పట్టించుకోకూడదని చెబుతూ.. ఈ ప్రభుత్వంలో తాను ఎదుర్కున్న అనుభవాలను తెలియజేశారు. ‘‘గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర డిప్యుటేషన్ పదవి వస్తుందని భావించి దిల్లీకి వెళ్లా. అక్కడ ఏపీ భవన్‌లో నా సీనియారిటీకి తగ్గ పదవి లేకపోయినా డిసెంబర్ వరకు వేచి చూసా. తిరిగి రాష్ట్రానికి వచ్చేసినా నేనేమీ నిరుత్సాహపడలేదు. భగవంతుడు ఏది రాస్తే అదే మనకు దక్కిన ఫలితంగా విద్యార్థులు భావించాలి’’ అంటూ విద్యార్థులకు ప్రవీణ్ సూచించారు.

72.26 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి

మరోవైపు పదో తరగతి పరీక్షా ఫలితాలు కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 69.27 కాగా.. బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. మొత్తం 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత లభించింది. 38 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 84.7శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరి స్థానం పొందింది. జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరు తేదీ మే17గా నిర్ణయించారు. అలాగే రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ దరఖాస్తుకు మే 13 చివరి తేదీ. గత ఏడాది తో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత 5 శాతం పెరిగింది. మొత్తం 6,05,052 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో బాలురు 3,09,245 మంది, బాలికలు 2,95,807 మంది పరీక్ష రాశారు.

Updated Date - 2023-05-06T16:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising