TDP: మినీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు: దేవినేని ఉమ
ABN, First Publish Date - 2023-05-30T21:50:23+05:30
మహానాడులో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మహిళలకు వరాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ..
ఎన్టీఆర్: మహానాడులో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మహిళలకు వరాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జి కొండూరు రెడ్డిగూడెం మైలవరం మండల కేంద్రాల్లో ఆయన చిత్రపటాలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) పాలాభిషేకం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంపై చర్యలు తీసుకోవాలని మైలవరం పోలీస్‌స్టేషన్‌లో దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. సీతారాంకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. ఉన్నత పదవిలో ఉండి చంద్రబాబుపై సీతారాం అహంకారం ధోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవికి వన్నె తేవాల్సింది పోయి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో వైసీపీ (YCP)లో వణుకు మొదలయిందన్నారు. మహిళలకు పథకాల ప్రకటనతో జగన్‌రెడ్డి పని అయిపొయిందన్నారు.
Updated Date - 2023-05-30T21:51:18+05:30 IST