Ayyanna Patrudu: నాపై 15 కేసులు పెట్టారు
ABN, First Publish Date - 2023-09-20T16:03:53+05:30
కృష్ణా జిల్లా: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తనపై 15 కేసులు పెట్టారని.. మాట్లాడితే వైసీపీ నాయకులు జోకులు వేస్తున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తనపై 15 కేసులు పెట్టారని.. మాట్లాడితే వైసీపీ నాయకులు (YCP Leaders) జోకులు వేస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ఆర్కే రోజా (Roja)ని రింగులు రాణి అంటే బూతులా? అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)ని ఈ ప్రజలే రాజకీయ సమాధి చేస్తారని.. ఆరు నెలల్లో జగన్ పతనం ఖాయమని అన్నారు. మన దేశ సంపద దోచుకుంటున్నారని... బ్రిటిష్ వాళ్ళను మనం తరిమికొట్టామని, మరి రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని ప్రశ్నించారు.
వైజాగ్ ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని.. 50 కిలోమీటర్లు తీసుకొచ్చి తరువాత దిగి వెళ్లిపోమన్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే ‘‘నేను దిగను మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్లాలని పోలీసులకు చెప్పాను.... పోలీసులు తెల్ల మొహం పెట్టి నోటీస్ చేతులో పెట్టి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్లారు’’... అని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తంలో పెట్టేరోగాని దాన్ని ఎవరు కదపలేరన్నారు. ఢిల్లీలో నారా లోకేష్‌ను కలిసానని, భయపడే ప్రసక్తే లేదని, యువగళం పాదయాత్ర బ్రాహ్మణి చేస్తుందని చెప్పారన్నారు. విదేశాల నుంచి టీడీపీకి చాలా మంచి స్పందన వస్తోందని, రాజశేఖర్ రెడ్డి సమాధి ఉన్న ఇడుపులపాయలో త్రిబుల్ ఐటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టామని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-20T16:03:53+05:30 IST