ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhuvaneshwari: చంద్రబాబును చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి..

ABN, First Publish Date - 2023-09-10T11:01:57+05:30

విజయవాడ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై విచారణ జరుగుతోంది.

విజయవాడ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను సీఐడీ (CID) అధికారులు అరెస్టు చేసి ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు (Remand Report)పై విచారణ జరుగుతోంది. తాను ఏ తప్పు చేయలేదని, తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబును చూసి ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం. దీన్ని పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బాధలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. తన భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారని.. ఈ పోరాటం విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. చంద్రబాబు పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే ఆదివారం చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం. ఈ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చంద్రబాబుతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి తొలుత భావించారు. కానీ శనివారం ఉదయమే చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో శనివారమే అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-09-10T11:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising