ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Debt: ఏపీ అప్పులపై మరోసారి వివరాలు బయటపెట్టిన కేంద్ర ఆర్ధిక శాఖ

ABN, First Publish Date - 2023-08-01T16:23:05+05:30

న్యూఢిల్లీ: ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మరోసారి వివరాలు బయటపెట్టింది. రాష్ట్రంలో బడ్జెటేతర అప్పులు రూ. 79,815 కోట్లని పేర్కొంది. 2021-22, 2022-23... రెండు సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్లకు పైగా...

న్యూఢిల్లీ: ఏపీ అప్పులపై (AP Debt) కేంద్ర ఆర్ధిక శాఖ (Central Finance Department) మరోసారి వివరాలు బయటపెట్టింది. రాష్ట్రంలో బడ్జెటేతర అప్పులు రూ. 79,815 కోట్లని పేర్కొంది. 2021-22, 2022-23... రెండు సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్లకు పైగా... కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ సర్కార్ తమకు నివేదించిందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.

2021-22 ఏడాదిలో రూ. 22,366.08 కోట్లు, 2022-23 ఏడాదిలో రు. 57,449.55 కోట్లు తీసుకుందని, ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు. మొత్తం రూ. 79,815 కోట్లు.. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉందని కేంద్రం పేర్కొంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు గ్యారెంటీ ఇస్తే... అవి రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ... 2022 మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకు ముందు రెండేళ్లలో... పరిమితికి మించి రూ. 29,183 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీనిపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindrakumar), మరో సభ్యుడు అడిగిన ప్రశ్నలకు మంగళవారం రాజ్యసభ (Rajya Sabha)లో రాతపూర్వకంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి (Pankaj Choudary) సమాధానం ఇచ్చారు.

Updated Date - 2023-08-01T16:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising