ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB Court: ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు: చంద్రబాబు

ABN, First Publish Date - 2023-09-10T11:49:37+05:30

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో న్యాయమూర్తికి స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్‌ తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏసీబీ కోర్టు (ACB Court)లో న్యాయమూర్తికి స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్‌ తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చామన్నారు. దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరన్నారు. 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కానీ.. రిమాండ్‌ రిపోర్టులో కూడా తన పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

కాగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం మొదటి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేకించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దాడి మరింత పెంచింది. 1999-2004 నడుమ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టులో కేసు వేశారు. విచారణ కొంత కాలం గడచిన తర్వాత.. న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు సలహాతో ఆ కేసును ఉపసంహరించుకున్నారు. ఆధారాల్లేవని కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తే ఇక భవిష్యత్‌లో అదే అంశంపై మళ్లీ కేసు వేయడం సాధ్యపడదని న్యాయవాది చెప్పడంతో గత్యంతరం లేక రాజశేఖరరెడ్డి కేసు ఉపసంహరణకు అంగీకరించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో చంద్రబాబుపై అనేక విచారణ కమిటీలను నియమించారు. ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు.

హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్‌కు దూరమై ప్రాంతీయ పార్టీ పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు తన తల్లి విజయలక్ష్మితో హైకోర్టులో పిటిషన్‌ వేయించారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న 11 నిర్ణయాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆమె అభ్యర్థించారు. ఇందులో ప్రజాప్రయోజనం లేదంటూ ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే అక్కడా విచారణకు స్వీకరించలేదు. అంతటితో ఆ అంకం ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీ సీఎం అయ్యారు. జగన్‌పై మరిన్ని విచారణలు చేయించడానికి ఆయనకు అవకాశం ఉన్నా వాటి జోలికి పోలేదు. కానీ జగన్‌ తాను సీఎం అయినప్పటి నుంచీ చంద్రబాబుపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడీ అరెస్టు జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై జగన్‌ వ్యక్తిగత ద్వేషం పెంచుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - 2023-09-10T11:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising