CM Jagan: విద్యాశాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష
ABN, First Publish Date - 2023-04-10T08:11:00+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం (CM Camp Office)లో విద్యాశాఖ (Education)పై సమీక్ష చేయనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం (CM Camp Office)లో విద్యాశాఖ (Education)పై సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం మూడు గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష జరపనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini), పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులపై (Covid Cases) కూడా సమీక్ష చేయనున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కోవిడ్ సన్నద్ధత, ప్రభుత్వ ఆసుపత్రులలో మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్షలో చర్చించనున్నారు.
కాగా దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈనెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ ప్రకటనలు చేశాయి. అన్ని జిల్లాల్లోని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మాక్ డ్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్లు, ఆక్సిజన్, పడకలు సరిపడా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు.
Updated Date - 2023-04-10T08:11:00+05:30 IST