కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2023-12-05T13:57:53+05:30

అమరావతి: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

CM Jagan: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: తుపాను (Cyclone) బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మిచౌంగ్ తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు, కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్ అయిందని, సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు గుర్తించారు.

చీరాల బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటి వరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు.

వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ కూడా ప్రారంభం కావాలని, గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధలను వాడుకుని రేషన్‌ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

Updated Date - 2023-12-05T13:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising