CPI: విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొనడంపై రామకృష్ణ ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-04-10T12:30:35+05:30
విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆత్మహత్యే శరణ్యమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ (Telangana) పాల్గొంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)కి ఆత్మహత్యే శరణ్యమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... చిన్న రాష్ట్రం బిడ్డింగ్‌లో చిన్న రాష్ట్రం తెలంగాణ పాల్గొంటే.. జగన్ సంక నాకటానికా? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్‌కు అవమానమన్నారు. జగన్ (AP CM)కు ధైర్యముంటే మోదీ దగ్గరకు వెళ్ళి ఆపాలని.. లేకుంటే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఎందరో బలిదానాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోందని మండిపడ్డారు. మోదీ (PM Narendra modi), జగన్ కలిసి అదానీ (Adani)కి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటుందని సీఎం కేసీఆర్ (Telangana CM) చెప్పారని... చిన్న రాష్ట్రం తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటుంటే జగన్ సంక నాకుతున్నాడా అంటూ వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే ఆంధ్రా ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-10T12:49:28+05:30 IST