ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Sivakumar: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ABN, First Publish Date - 2023-11-11T12:38:15+05:30

తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని, నిన్న (శుక్రవారం) తెలంగాణ ఎన్నికల‌ ప్రచారంలో పాల్గొన్నానని అక్కడ కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని.. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీపై విశ్వాసంతో ఉన్నారని, కాంగ్రెస్ విజయం ఖాయమని కర్నాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

విజయవాడ: తెలంగాణ ప్రజలు (Telangana People) ప్రభుత్వ మార్పు (Change Govt.) కోరుకుంటున్నారని, నిన్న (శుక్రవారం) తెలంగాణ ఎన్నికల‌ ప్రచారంలో పాల్గొన్నానని అక్కడ కాంగ్రెస్ వేవ్ (Congress wave) నడుస్తోందని.. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ (Sonia Gandhi)పై విశ్వాసంతో ఉన్నారని, కాంగ్రెస్ విజయం ఖాయమని కర్నాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ (Karnataka Deputy CM DK Shivakumar) వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడ (Vijayawada) వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏపీ (AP)లో కూడా ఏదొకరోజు తప్పకుండా అధికారంలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తప్పకుండా ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారని, నేటి కార్యకర్తలే రేపటి నాయకులు, మంత్రులు అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందరూ ఇలా ఎదిగిన వారేనని, కుర్చీ కావాలంటే కుర్చీ కోసం పోరాడాలని శివకుమార్ వ్యాఖ్యానించారు. పని చేసేవారిని జాగ్రత్తగా చూసుకుంటే పార్టీ బలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చరిత్ర దేశ చరిత్రని.. పాలిటిక్స్‌లో ఎవరూ శాశ్వతం కాదని, రాజధాని అంశం, ప్రత్యేక హోదా, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ఏపీకి కమిట్‌మెంట్ ఇచ్చిందన్నారు. జాతీయ పార్టీలు యాక్టివ్‌గా లేకపోవడం.. ఏపీలో అభివృద్ధి లేకపోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఇండియా కూటమిగా కాంగ్రెస్‌తో 26 పార్టీలు కలిసి పని చేస్తాయన్నారు. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కారణంగా దేశం సంయుక్తంగా ఉందని, నమ్మకాన్ని కోల్పోవద్దని, సమస్యలపై పోరాడాలని, కలిసి, ఆలోచించి, పనిచేయాలని.. అదే గెలుపుకు కారణమని డీకే శివకుమార్ అన్నారు.

Updated Date - 2023-11-11T12:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising