Delhi liquor Scam: మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
ABN, First Publish Date - 2023-03-18T15:32:11+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను స్పెషల్ కోర్టు పొడిగించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor Scam) లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (YCP MPMagunta Srinivasulu Reddy) కుమారుడు మాగుంట రాఘవరెడ్డి (Magunta RaghavaReddy) జ్యుడిషియల్ రిమాండ్‌ను స్పెషల్ కోర్టు (Special Court) పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉండటం గమనార్హం. అతనిని ఈరోజు సీబీఐ కోర్టు (CBI Court)లో ఈడీ అధికారులు (ED Officials) హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పురోగతిలో ఉందని.. కాబట్టి మాగుంట రాఘవరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో విజ్ఞప్తి చేశారు.
ఈడీ అభ్యర్థన మేరకు మార్చి 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్‌గ్రూప్‌లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారించిన ఈడీ అధికారులు ఆపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని మాగుంటను విచారించింది. విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్డడీకి తరలించారు. తాజాగా జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతోనే మరో 11 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఈడీ విచారణకు శ్రీనివాసులురెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే ఇంత వరకు మాగుంట హాజరుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై అటు ఈడీ అధికారులు నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈరోజు ఉదయం 11 గంటలకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.
Updated Date - 2023-03-18T15:43:30+05:30 IST