ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkaiah Naidu: ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై వెంకయ్య సెటైర్లు

ABN, First Publish Date - 2023-02-12T15:50:37+05:30

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం (English Medium) అమలవుతున్న నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సెటైర్లు (Satyrs) వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం (English Medium) అమలవుతున్న నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సెటైర్లు (Satyrs) వేశారు. ఆదివారం విజయవాడ, యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలని సూచించారు. ఆంగ్లాన్ని నేర్చుకున్నా.. మాతృభాషను ఎవరూ విస్మరించకూడదని అన్నారు. పిల్లలకు మాతృభాషను తల్లిదండ్రులు తప్పక నేర్పించాలన్నారు.

విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్‌ను ఎంజీరోడ్ అనడం మన దౌర్భాగ్యమని, ఎంజీ రోడ్డును మహాత్మా గాంధీ రోడ్‌గానే పిలవాలని కోరుతున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. ధర్మ రక్షణ కోసం, మానసిక ప్రశాంతక, సంపూర్ణ ఆరోగ్యం, కల్పన కోసం పూర్వికులు ఆలయాలు నిర్మించారని అన్నారు. సూర్యుడు వెలుతురు వినియోగించుకున్నన్నాళ్లు... మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. రాత్రి త్వరగా పడుకుని సూర్యోదయం వేళల్లో లేవాలని సూచించారు. సెల్ ఫోన్ అతిగా వినియోగిస్తే హెల్ ఫోన్ అవుతుందని, సెల్ ఫోన్‌ను పరిమితంగా మాత్రమే వాడాలన్నారు.

ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుందని, నీరు, చెట్లను, రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని వెంకయ్య నాయుడు అన్నారు. నిత్యం వెలుతురుతో మనం నివశించాలని, గాలి, వెలుతురు సూర్యరస్మికి దగ్గరగా ఉంటారు కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో వారికి కరోనా ఎక్కువగా రాలేదన్నారు. 80 శాతం పట్టణ ప్రాంతాల వారికే కరోనా వచ్చిందన్నారు. సూర్యరశ్మిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ప్రజలు ఆదాయాన్ని పెంచుకుని ఇతరులతో పంచుకుంటేనే ఆనందమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సూచించారు. మంత్రాలు చదివి వాటి అర్థాన్ని తెలుగులో భక్తులకు అర్థం చెప్పాలని పురోహితులకు చెబుతున్నా.. అందరూ నవ్వుతూ బ్రతకాలని కోరుకుంటున్నా.. ప్రతి ఒక్కరూ ఇతరులకు ప్రేమను పంచుతూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

కాగా అంతకుముందు ఆదివారం ఉదయం యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన వెంకయ్యనాయుడుకి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ రామలింగేశ్వర స్వామిని, పార్వతీదేవి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయంలో నిర్వహిస్తోన్న మహా సౌరయాగంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-12T15:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising