ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : ప్రకాశం బ్యారేజ్ కి భారీగా చేరుకుంటున్న వరద నీరు

ABN, First Publish Date - 2023-07-28T09:46:32+05:30

ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని అధికారులు సముద్రంలో విడుదల చేస్తున్నారు. డెల్టా కలువలకు పూర్తిగా నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు.

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని అధికారులు సముద్రంలో విడుదల చేస్తున్నారు. డెల్టా కలువలకు పూర్తిగా నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు. అధికారులు ప్రకాశం బ్యారేజీ 50 గేట్లు 6 అడుగులు మేర ఎత్తగా.. 20 గేట్లను 5 అడుగులుమేరకు ఎత్తి 2,50,000 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామస్తులను నదీ పరివాహక ప్రాంత అధికారులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

మరోవైపు మునేరు మహోగ్ర రూపం దాల్చింది. ప్రమాదస్థాయిని మించి పరవళ్లు తొక్కుతోంది. కీసర వంతెన సమీపంలో నీళ్లు రోడ్డెక్కడంతో విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వరద పెరుగుతూనే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. కీసర వంతెన-నందిగామ మండలం ఐతవరం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మునేరు 2అడుగుల ఎత్తున పొంగుతోంది. దీంతో సాయంత్రం 4.30గంటల నుంచి కంచికచర్ల- నందిగామ మధ్య, విజయవాడ, హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు బంద్‌ అయ్యాయి.

Updated Date - 2023-07-28T09:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising