TDP : మచిలీపట్నంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-23T12:03:22+05:30
గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
కృష్ణా: గన్నవరం (Gannavaram)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గన్నవరంలో టీడీపీ కార్యాలయం (TDP Office)పై వైసీపీ (YCP) రౌడీల దాడి అనంతరం బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ నేతల (TDP Leaders) ను బయట తిరగనీయకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరు టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana), కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ... గన్నవరంలో వైసీపీ రౌడీ మూకలు నియోజవర్గ కార్యాలయంలో చొరబడి చేసిన విధ్వంసంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల మీద నాన్ బెయిల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య కేసులో రాష్ట్ర పోలీసులు నిజాలు తీర్చలేక పోయారు గానీ సీబీఐ (CBI) ద్వారా రోజు రోజుకు నిజాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీపై అక్రమ కేసులు పెట్టడానికి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి రాష్ట్ర పోలీసులు ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటన గురించి తనకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని అటువంటి సమయంలో తామే సుమోటో కేసుగా బుక్ చేసి చర్యలు తీసుకున్నామని అన్నారన్నారు. అసలు ఫిర్యాదు చేయడం కోసమే పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పట్టాభి, దొంతు చిన్నపైనే కేసు పెట్టడం పోలీసుల దిగజారుడుతనానికి నిదర్శనమని నారాయణ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-02-23T12:17:33+05:30 IST