Indrakiladri: విజయవాడ దుర్గ అమ్మవారి ముఖమండపం వద్ద మగ పోలీసులు.. మహిళ భక్తులకు ఇబ్బందులు
ABN, First Publish Date - 2023-10-22T18:26:08+05:30
ఇంద్రకీలాద్రి అమ్మవారి ముఖమండపం వద్ద మగపోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారి ముఖమండపం వద్ద మగపోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో వచ్చే మహిళా భక్తులను మగపోలీసులు ముందుకు లాగేస్తున్నారు. గతంలోనూ మహిళా పోలీసుల కన్నా మగ పోలీసులే ముఖమండపం వద్ద ఉంచడంపై భక్తులు అభ్యంతరం తెలిపారు. అయిన పోలీసులు తీరు మార్చుకోకపోవడంతో భక్తులు ఆందోళన చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళలను మగపోలీసులు మహిళా భక్తులను నెట్టడంపై అభ్యంతరం తెలిపారు.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో బారులు తీరిన వీఐపీ వాహనాలు
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో వీఐపీల వాహనాలు బారులు దీరాయి. పదుల సంఖ్యలో భక్తులను వాహనాలల్లో తరలిస్తున్నారు. వీఐపీల సేవలుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయింది. సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శనం చుక్కలు చూపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. కొండపై అడుగడుగున పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
Updated Date - 2023-10-22T18:31:24+05:30 IST