ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: జగ్గయ్యపేటలో విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. ఆరుగురికి నోటీసులు

ABN, First Publish Date - 2023-03-06T14:25:06+05:30

జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మాజీ సర్పంచ్ సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మాజీ సర్పంచ్ సామినేని విశ్వనాథం విగ్రహం (Former Sarpanch Samineni Viswanatham statue) ఏర్పాటుపై ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సహా ఆరుగురికి హైకోర్టు (AP High court) నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు (SupremeCourt) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో ఇన్ అండ్ అవుట్ గేట్ మధ్య విగ్రహం ఏర్పాటు చేశారని కోర్టుకు ఆర్కే న్యాయవాదులు తెలిపారు. బ్యూటిఫికేషన్ పేరుతో ఫౌంటెన్ గ్రీనరీ ఏర్పాటు చేస్తామని ఆర్టీసీని పురపాలక శాఖ అధికారులు అనుమతి కోరారు. అయితే అందుకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆర్కే తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ...రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానులకు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో విగ్రహం ఏర్పాటుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2023-03-06T14:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising