ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై ఏవీ రమణ ఆసక్తికర ట్వీట్

ABN, First Publish Date - 2023-12-06T13:32:32+05:30

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆసక్తికర ట్వీట్ చేశారు. భక్తులకు వడ్డించిన భోజనం,.. సీఎం జగన్‌కు వడ్డించిన భోజనం ఫోటోలతో ఆయన ట్వీట్ చేశారు.

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆసక్తికర ట్వీట్ చేశారు. భక్తులకు వడ్డించిన భోజనం,.. సీఎం జగన్‌కు వడ్డించిన భోజనం ఫోటోలతో ఆయన ట్వీట్ చేశారు. ‘జనానికి అలా... జగన్‌కు ఇలా’ అంటూ ట్వీట్‌లో ఫోటోలు పెట్టారు.

కలియుగ దైవం శ్రీవారి సన్నిధిని వివాదాల మయం చేస్తున్నారని, హిందువులు పరమ పవిత్రంగా భావించే ఏడుకొండలను అపవిత్రం చేస్తున్నారని ఏవీ రమణ అన్నారు. భక్తుల కోసం అనాడు అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదాన కార్యక్రమాన్ని సర్వనాశనం చేశారన్నారు. తిరుమల కొండ అంటే ఒకప్పుడు ఆద్యాత్మికత, ప్రశాంతత ఉండేదని ఆయన అన్నారు.

కానీ నేటి ప్రభుత్వం, టీటీడీ పెద్దలు తిరుమల కొండ అంటే.. సొంత ప్రయోజనాలకు, లాబీయింగ్‌కు కేంద్రంగా మార్చేశారని ఏవీ రమణ విమర్శించారు. దీనిని కోట్ల మంది భక్తులు, గోవిందుడు క్షమించే ప్రసక్తే లేదని, పాపాలకు ఫలితం తొందరలోనే అనుభవిస్తారంటూ ఏవీ రమణ ట్వీట్ చేశారు.

తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో మంగళవారం భక్తులు నిరసన తెలిపారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు. ఇలాంటి అన్నం పెడతారా? అంటూ నిలదీశారు. అయితే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని టీటీడీ సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది భక్తులకు సర్దిచెప్పి పంపించేశారు.

కాగా తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బియ్యంలో నాణ్యత లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదన్నారు. అదే సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ఆ భక్తులకులేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు ఎదురైందో తెలియడంలేదన్నారు. ఇతర భక్తులను కొంత మంది భక్తులు రెచ్చగొట్టడం.. అక్కడ పని చేసే సిబ్బంది త్రాగుబోతులని ఆరోపించడం బాధాకరమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-12-06T13:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising