Janasena Leader: ఈ హత్యలు చేయించింది అవినాష్ రెడ్డా?... జగన్ రెడ్డా? : పోతిన
ABN, First Publish Date - 2023-04-18T11:40:08+05:30
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసు డ్రామాపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Murder Case), కోడి కత్తి కేసు (Kodikatti Case) డ్రామాపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Jana Sena State Spokesperson Pothina Venkata Mahesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో జగన్‌కు (YS Jaganmohan Reddy) భయం పట్టుకుందన్నారు. అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy), భాస్కర రెడ్డిది (Bhaskar Reddy) ముఖ్య పాత్ర అని నిర్ధారణ అయ్యిందని... సీబీఐ అధికారులు (CBI Officials) ఆధారాలు సేకరించారు కాబట్టే అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యలు చేయించింది అవినాష్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా అనే అనుమానం కలుగుతుందన్నారు. లాబీయిష్టులను దింపి కేసు తారుమారు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భాస్కర రెడ్డి, అవినాష్ రెడ్డిలతో పాటు ఎవరి పాత్ర ఉందో బయటకి రావాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి (AP CM) కుటుంబంలో ప్రమేయం ఉన్న వారి వివరాలు బయట పెట్టాలన్నారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. పర్యటనలు కూడా మానుకుని పైరవీలు చేస్తున్నారని యెద్దేవా చేశారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని... దోషులకు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.
కోడి కత్తి డ్రామా కత్తి...
అలాగే కోడికత్తి కేసుపై మాట్లాడుతూ... కోడి కత్తి డ్రామా కత్తి అని ప్రజలకు అర్ధం అయ్యిందన్నారు. కోడి కత్తి కేసులో కోర్టుకు రమ్మంటే ట్రాఫిక్ ఇబ్బంది అంట.. మరి ఇఫ్తార్ విందు, తమ సభలకు జగన్ బయటకి రావడం లేదా.. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం లేదా అంటూ ప్రశ్నించారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేలా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ మాయలు, మోసాలు ప్రజలకు అర్ధం అయ్యాయన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్‌కు బుద్ధి చెప్పి ఇంటికి పంపడం ఖాయమన్నారు. 175/175 కాదు... కనీసం డిపాజిట్‌లు కూడా రావనేది వాస్తవమని పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-04-18T11:40:11+05:30 IST