Kodikathi Case: కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదు: ఎన్‌ఐఏ
ABN, First Publish Date - 2023-04-13T14:19:31+05:30
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
అమరావతి: సీఎం వైఎస్ జగన్‌పై వైజాగ్‌లో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణంలేదని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని వెల్లడించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తేలిందని పేర్కొంది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10వ తేదీన జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోరింది.
కాాగా ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. గురువారం కోడికత్తి కేసులో ఏఐఏ కోర్టులో విచారణ జరగగా.. నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేశారు. గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్‌పై సలీం కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ పీపీ విశాల్ గౌతమ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. రెండు కౌంటర్లలో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కౌంటర్లు వేశారు.
అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. 17న వాదనలు చెప్పాలని... అదే రోజు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా.. వాయిదాలు ఇవ్వద్దంటూ నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఈ నెల 17కే కదా వాయిదా వేసింది అని న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు. కేసు తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి...
Kavitha Vs Sukesh : కవిత సంచలన ప్రకటనపై సుకేష్ లాయర్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఇంత మాట అనేశారేంటి..?
Updated Date - 2023-04-13T19:18:36+05:30 IST