ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodikatti Case: కోడికత్తి కేసు విచారణ మే 10కి వాయిదా..

ABN, First Publish Date - 2023-04-27T14:11:01+05:30

విజయవాడ: కోడికత్తి కేసు (Kodikatti Case) విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్‌ (Srinivas)ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్‌ (Video Call)లో ఎన్ఐఏ కోర్టు (NIA Court) విచారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోడికత్తి కేసు (Kodikatti Case) విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్‌ (Srinivas)ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్‌ (Video Call)లో ఎన్ఐఏ కోర్టు (NIA Court) విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో సీఎం జగన్ (CM Jagan) పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని అభ్యర్ధించారు. అయితే ఈ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించినప్పటికీ.. తాత్కాలిక న్యాయమూర్తి కావడం.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో కేసును వాయిదా వేశారు.

ప్రధానంగా సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ ఒక పిటిషన్.. దానికి సంబంధించి అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. దీనిపై ఇప్పటికే నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగాల్సి ఉంది. అదే సమయంలో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ జరపలేదని, పూర్తి స్థాయిలో మరొకసారి ఈ కేసుపై విచారణ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ రెండు పిటిషన్లపై ఈరోజు విచారణ జరుగుతుందని అంతా భావించారు. అయితే ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారిస్తానని పేర్కొంటూ కేసును మే 10వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2023-04-27T14:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising