Nara Lokesh: యువగళం పాదయాత్రతో దూసుకెళ్తున్న లోకేష్..
ABN, First Publish Date - 2023-08-21T16:14:33+05:30
కృష్ణాజిల్లా: యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకెళుతున్నారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది.
కృష్ణాజిల్లా: యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) దూసుకెళుతున్నారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లా (Krishna Dist.)లో కొనసాగుతోంది. ప్రజల సమస్యలను వింటూ వారికి ధైర్యం చెబుతూ లోకేష్ తన పాదయాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఆకాశమే హద్దుగా సాగుతున్న పాదయాత్రలో లోకేష్ ఇప్పటి వరకు 2,525 కి.మీ. పాదయాత్రను పూర్తి చేసారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఫుల్ జోష్ (Full Josh)తో ముందుకు వెళుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్‌ను చూడాలని, వారి సమస్యలను యువనేత దృష్టికి తీసుకువెళ్లాలని ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో లోకేష్ మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు.
నిన్న సాయంత్రం 3 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3:40 గంటల వరకు అంటే 12 గంటలకుపైగా నిర్విరామంగా 16 కి.మీ. పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఏకధాటిగా తొలిసారి 12 గంటలపాటు నిర్వహించారు. నిన్న విజయవాడ ఏకన్వెన్షన్ నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర మదర్ థెరిస్సా, గాయత్రీనగర్, ఎన్టీఆర్ సర్కిల్, పటమటసెంటర్, హైస్కూల్ రోడ్డు, సనత్‌నగర్, కానూరు, తాడిగడప, పోరంకి మీదుగా నిడమానూరు వరకు కొనసాగింది. మహిళలు, యువతీ యువకులు భారీగా రోడ్లపైకి వచ్చి లోకేష్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
Updated Date - 2023-08-21T16:14:33+05:30 IST