ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

ABN, First Publish Date - 2023-08-25T12:54:03+05:30

కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP youth Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు (Dalits) యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఎస్సీ (SC)లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేసిందన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారని, గురుకుల పాఠశాలలో వసతులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ..

‘ఎన్నికల సమయంలో నా ఎస్సీలంటూ దళితులపై కపట ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా’ వ్యవహరిస్తున్నారని లోకేష్ విమర్శించారు. నాలుగేళ్లుగా దళితుల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టని జగన్.. గతంలో టీడీపీ (TDP) అమలు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారని మండిపడ్డారు. దళితులకు చెందాల్సిన ఎస్సీ రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారన్నారు. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. పేద దళితుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలకు పక్కా ఇళ్లు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తివేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-25T12:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising