ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Bosta: చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలి..

ABN, First Publish Date - 2023-08-08T15:21:11+05:30

విజయవాడ: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా? చిరంజీవి చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు.

విజయవాడ: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా? ఆ విషయం చిరంజీవి (Chiranjeevi) చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోందని, చిరంజీవి వ్యాఖ్యలను చూసిన తరువాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని మంత్రి అన్నారు.

టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu)పై మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజశేఖర రెడ్డి (Rajasekhar Reddy) హయాంలో పోలవరం పనులు వేగంగా జరిగాయని, ఆయన తనయుడు వైఎస్ జగన్ (YS Jagan) పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పారు. వైఎస్ తవ్వించిన పోలవరం కాలువల్ని చంద్రబాబు పట్టిసీమగా మార్చారన్నారు. పోలవరం నిర్వాసితులకు రావలసిన ఆర్ అండ్ ఆర్ (R@R) ప్యాకేజీ (Package) కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇంకొక ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రజలు విశ్రాంతి ఇస్తారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. పుంగనూరులో ముందుగా అనుకోకపోతే ఆ తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. లోకేష్ తన పాదయాత్రలో ఏ‌ అధికారి గురించీ సరిగా మాట్లాడలేదని మంత్రి బొత్స అన్నారు.

జనసేన అధ్యక్షుడు (Janasena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన వారాహి యాత్ర (Varahi Yatra)ను తాము అడ్డుకొమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఊరుకోం‌‌‌‌మన్నారు. ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేయొచ్చునని అన్నారు. విశాఖలో పవన్ చేపడుతున్న వారాహి యాత్ర గురించి దేశంలో చర్చ జరుగుతుందని అంటున్నారు.. చంద్రబాబు పుంగనూరు యాత్రలా విధ్వంసం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. వారాహి యాత్రను తాము పట్టించుకొవడం లేదని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు.

Updated Date - 2023-08-08T15:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising