Gadde Ramamohan: ప్రజల బాధలు చూస్తే జగన్ కళ్లలో ఆనందం..
ABN, First Publish Date - 2023-01-10T15:51:59+05:30
చిన్న సమస్యపై మహిళ ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? అని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ ఆరాచకాల్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రికి మహా ఇష్టమని అన్నారు.
విజయవాడ (Vijayawada): నగరంలోని తారకరామ నగర్ 17వ డివిజన్‌లో ఓ మహిళ కుటుంబసభ్యుల కళ్లల్లో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Ramamohan) బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కృష్ణలంక పోలీస్టేషన్‌కు వచ్చి.. పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడిలో గాయపడ్డ మహిళల్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమన్నారు. చిన్న సమస్యపై మహిళ ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ (CM Jagan) ఈ ఆరాచకాల్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రికి మహా ఇష్టమని, ఆయన కళ్లకు ఆనందమని అన్నారు.
మహిళల కళ్ళలో కారం కొట్టింది దేవినేని అవినాష్ అనుచరులేనని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాకుండానే పార్టీ ఇన్ఛార్జ్‌గా అవినాష్ ఇంతలా రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్ పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎన్టీఆర్ భవన్, పట్టాభి ఇంటిపై దాడిలోనూ అవినాష్ పాత్రధారి అని గద్దె రామ్మోహన్ అన్నారు.
Updated Date - 2023-01-10T15:52:03+05:30 IST