AP News: అమరావతి ఉద్యమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి...
ABN, First Publish Date - 2023-03-31T12:25:59+05:30
మందడం (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravathi) కోసం రైతులు (Farmers) చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరింది.
మందడం (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravathi) కోసం రైతులు (Farmers) చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా పలు రాజకీయపార్టీలు, నేతలు రైతులకు మద్దతు తెలుపుతూ మందడంలో కోనసాగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ (YCP) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో రైతులను పరామర్శ చేసిన నాటి నుంచి పార్టీలో కష్టాలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. తన మనవలు తనను చరిత్ర హీనుడు అనుకోకుండా వుండాలనే అమరావతికి మద్దతు ఇస్తున్నానన్నారు. అమరావతి రాజధాని నుంచి మట్టి పెళ్ళ కూడా ఎవ్వరూ తీసుకు వెళ్ళలేరని.. అమరావతికి మద్దతుగా నిలిచిన పార్టీలకు సునామీ లాంటి మద్దతు వస్తుందన్నారు. 3 రాజధానులన్న పార్టీ అమరావతి రాజకీయ రథచక్రాల కింద నలిగిపోతుందన్నారు. అమరావతి కోసం నెల్లూరు జిల్లా ఇప్పుడు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా వుందని, ఇప్పటికైనా సీఎం జగన్ (CM Jagan) తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోటంరెడ్డి సూచించారు.
1200 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం వెన్ను చూపక, మాట తప్పక, మడమ చూపక, లాఠీలకు వెరవక దుర్మార్గపు నాయకులకు ఎదురు తిరిగిన ఉద్యమ కారులకు కోటంరెడ్డి ఉద్యమాది అభినందనలు తెలిపారు. శ్రీరాముడి రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుడుది ద్వారకా, దేవతల రాజధాని అమరావతి అంటూ వ్యాఖ్యానించారు. అమరావతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీసుకున్న నిర్ణయం సముచితమైనదన్నారు. ఆనాడు ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన చేస్తే.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మద్దతు పలికిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతి రాజధాని ప్రపంచ తెలుగు ప్రజల ఆకాంక్ష అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పొరపాటు చేయడం సహజమని సరిదిద్దుకుని చెపుతున్నానని.. 1200 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గౌరవిస్తానని సీఎం జగన్ చెపితే ప్రజలు నేటికీ స్వాగతిస్తారన్నారు. ఇన్నిరోజులుగా ఎందుకు ముందుకు రాలేదని అని అడిగితే ఒక్కటే చెపుతా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేనని, సీఎం జగన్ ఏమి చెపితే అదే మాట్లాడాలని అన్నారు. తనకూ అమరావతి ఉద్యమానికి ఏదో తెలియని బంధం ఉందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Sathyakumar), మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి (Adinarayana reddy), కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraja), వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ (Sunkara Padmasri), టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ (Kanna Lakshminarayana), ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ (Panchumarthi Anuradha) తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-31T12:25:59+05:30 IST