AP NEWS; కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎమ్మెల్యే ఉదయభాను
ABN, First Publish Date - 2023-08-11T21:03:10+05:30
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Union Railway Minister Ashwini Vaishnav)ని జగయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను(MLA Udayabhanu) కలిశారు.
ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Union Railway Minister Ashwini Vaishnav)ని జగయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను(MLA Udayabhanu) కలిశారు. మోటమర్రి జగ్గయ్యపేట సికింద్రాబాద్ గూడ్స్ రూటును ప్యాసింజర్ రూటుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ఉన్న గూడ్స్ రైళ్లు వెళ్లే మార్గంలో ప్యాసింజర్ రైళ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు అధికారులను కలిసి విజ్ఞాపనలు అందజేశారు. కేంద్రమంత్రి సూత్రప్రాయంగా ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం విజయవాడ మధిర కొండపల్లి కాజీపేట ఖమ్మం మీదుగా సికింద్రాబాద్‌కు రైళ్లు వెళ్తున్నాయి.
Updated Date - 2023-08-11T21:03:10+05:30 IST