ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR Dist.: కొడుకుపై బెంగతో తల్లి బలవన్మరణం

ABN, First Publish Date - 2023-04-23T14:03:02+05:30

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం, అంజనేయపురంలో కొడుకుపై బెంగతో ఓ తల్లి బలవన్మరణం చెందింది. తనయుడు చెంత లేడనే మనోవేదనతో ఎలుకలు మందు తిని ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం, అంజనేయపురంలో కొడుకుపై బెంగతో ఓ తల్లి బలవన్మరణం చెందింది. తనయుడు చెంత లేడనే మనోవేదనతో ఎలుకలు మందు తిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంజనేయపురం గ్రామానికి చెందిన అల్లరి ఆదిలక్ష్మి(51) తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఒక్కగానొక్క కొడుకు గోపికృష్ణకు ఏడాది క్రితం విజయవాడకు చెందిన రాజేశ్వరితో వివాహం చేసింది. భర్త కాలం చేయటంతో తన కొడుకు, కోడలితో కలిసి ఆంజనేయపురంలో నివాసం ఉంటుంది.

దివ్యాంగుడైన గోపికృష్ణ తిరువూరులోని ఒక ప్రైవేట్ వాహన షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా కుమారుడు విజయవాడలోని అత్తింట్లో భార్యతో కలిసి కాపురం ఉంటున్నాడు. తన వద్దకు రాకపోకటంతో తల్లి గోపికృష్ణకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. పని ఒత్తిడితో రాలేకపోయానని శుక్రవారం వస్తానని కొడుకు చెప్పాడు. అదే రోజు రాత్రి 8 గంటల వరకు కొడుకు కోసం ఎదురు చూసిన ఆదిలక్ష్మి.. అతను రాకపోవటంతో మనస్తాపం చెంది ఎలుకలు మందు తిని ఆత్మహత్యయత్నం చేసింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం తిరువూరులో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తీసుకువెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి కుమార్తె గుండాల లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-04-23T14:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising