ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-01-06T12:55:11+05:30

తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఫిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Narsapuram MP Raghuramakrishnam Raju) దాఖలు చేసిన ఫిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు (AP Highcourt) విచారించింది. ఎంపీపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌‌లు, రిజిస్టర్ కాని ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు ఆదేశించింది. చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకు అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. తనపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి రఘురామ లేఖ రాశారు. వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్ తరపున న్యాయవాది ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్‌చంద్ర వాదించింది. ప్రభుత్వం తరపున హోం శాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రఘురామకృష్ణపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

Updated Date - 2023-01-06T12:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising